హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై కడియం శ్రీహరి ప్రశ్నలు

JN: 2014లో ఒక్క ఎకరం కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న కల్వకుంట్ల కుటుంబానికి 2026 నాటికి వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ వనరులను దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు భూమి, ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.