హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐక్యతకు ప్రతీకగా నర్సాపూర్ వినాయక మండపం

MDK: వినాయక చవితి వేడుకల్లో నర్సాపూర్ 2వ వార్డు సునీతారెడ్డి కాలనీ యువత మత సామరస్యానికి అద్దం పట్టారు. హిందూ, ముస్లిం యువకులు కలిసికట్టుగా గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పోలీస్ అనుమతి పత్రాల్లోనూ ఇరు వర్గాల పేర్లను నమోదు చేసి తమ ఐక్యతను చాటారు. సామరస్యాన్ని చాటిన యువతను స్థానికులు విశేషంగా కొనియాడారు.