హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు సభ్యులకు నాలుగు రోజుల శిక్షణ: ఎంపీడీవో

SDPT: అక్కన్నపేట మండలంలోని 19 పంచాయతీల 148 మంది వార్డు సభ్యులకు ఈ నెల 22 నుంచి 26 వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బాధ్యతలు, రాజ్యాంగ హక్కులపై నిపుణులు పాఠాలు చెబుతారని వివరించారు. హాజరయ్యే సభ్యులు ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలని, నాలుగో రోజు కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తామన్నారు.