హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గొప్ప మనసు.. గుంతలు పూడ్చిన యాచకుడు

HYD: కేబీఆర్ పార్క్ ప్రధాన రహదారిపై ఓ యాచకుడు మానవత్వంతో చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. రహదారిపై ఏర్పడిన గుంత అత్యంత ప్రమాదకరంగా మారి, వాహనదారులు కింద పడి ప్రమాదాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని గమనించిన యాచకుడు వాహనదారులు కింద పడతారని, ప్రమాదాలు జరుగుతాయని మట్టి, రాళ్లను తెచ్చి ఆ గుంతను పూడ్చి ఉదారతను చాటుకున్నాడు.