హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోండి'

​MDK: పాపన్నపేట మండలంలో వ్యవసాయానికి 12 గంటల కరెంట్ ఇవ్వాలని ఎమ్మెల్యే రోహిత్ TGSPDCL సీఎండీని కోరారు. 8-9 గంటలే కరెంట్ వస్తుండటంతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు తెలపడంతో ఆయన స్పందించారు. పంటలను కాపాడేందుకు విద్యుత్ సరఫరా పెంచాలని సీఎండీతో ఫోన్‌లో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.