BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఐటీసీ గేట్ ఎదురుగా ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే..! ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి


