హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తకుప్పలతో శ్రీరంగాపురం ఉక్కిరిబిక్కిరి

WNP: చెత్తకుప్పలతో దోమలు, ఈగలు, పందులు చేరి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరంగాపురం గ్రామంలో పారిశుద్ధ్య పనులు స్తంభించడంతో ఖాళీ స్థలాల్లో ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, పాత దుస్తులు, ఇతర వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయాయి. దీంతో పరిసరాల్లో దుర్వాసన వ్యాపిస్తోంది. అధికారులు వెంటనే చెత్తను తొలగించాలన్నారు.