హైదరాబాద్: 28°C
తెలంగాణ

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న

WGL: వరంగల్ నగరంలోని 16వ డివిజన్ గరీబ్‌నగర్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న ప్రసాద్ తన తమ్ముడు ప్రవీణ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఇవాళ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని MGM ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.