హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య..!

HNK: హన్మకొండ సుబేదారి రెవెన్యూ కాలనీ నాగేంద్రనగర్‌కు చెందిన కానిస్టేబుల్‌ బిర్రు అనిల్‌ భార్య శిరీష(36) ఇంటి సెల్లార్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనిల్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఫింగర్‌ప్రింట్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, దంపతుల మధ్య కలహాలే కారణమని తెలుస్తోంది. శిరీష తండ్రి వెంకన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.