హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి కబడ్డీకి కేజీబీవీ విద్యార్థిని

NLG: శాలిగౌరారం మండల కేంద్రంలోని కేజీబీవీ 9వ తరగతి విద్యార్థిని వానరాశి సుప్రియ అండర్‌-14 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఈనెల 18,19 తేదీల్లో నకిరేకల్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. సుప్రియ ఎంపికపై తల్లిదండ్రులు అశోక్, అనిత, కేజీబీవీ ఎస్‌వో ప్రవళిక, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.