BDK: ద్విచక్ర వాహనదారులు ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇవాళ అశ్వారావుపేట సీఐ నాగరాజురెడ్డి సూచించారు. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ISI మార్కు ఉన్న నాణ్యమైన హెల్మెట్ ధరించి భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన అన్నారు.
తెలంగాణ
నిబంధనలు పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు: CI


