హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టెనో-టైపిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం

BHPL: జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న స్టెనో-టైపిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్ తెలిపారు. డిగ్రీతోపాటు స్టెనోగ్రఫీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.