హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉజ్జయినీ అమ్మవారి ఉత్సవాల్లో నిధులు గోల్‌మాల్!

HYD: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వహణ నిధులు గోల్‌మాల్ జరిగినట్లు తాజాగా తెరపైకి వచ్చింది. టెండర్లు పిలవకుండానే రూ.4లక్షల భోజనాల కాంట్రాక్ట్ పనులను ప్రైవేటు వ్యక్తులకు అధికారులు కట్టబెట్టారు. అనంతరం సదరు వ్యక్తులు ఏకంగా 600 మందికి భోజనాలు ఏర్పాటు చేశామంటూ లెక్కలు చూపారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని ఆలయాల పరిరక్షణ సమితి సభ్యులు కోరుతున్నారు.