హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతల రహదారిపై వాహనదారుల అవస్థలు

GDWL: అలంపూర్ మండల కేంద్రం నుంచి కాశీపురం వెళ్లే ప్రధాన రహదారిపై తారురోడ్డు లేచి భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పాలకవర్గం స్పందించి కనీసం గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.