హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వల్ప వర్షం.. పోలీస్ స్టేషన్‌లోకి నీరు

NGKL: తెలకపల్లి మండల కేంద్రంలో కురిసిన స్వల్ప వర్షానికే పోలీస్‌ స్టేషన్ ఆవరణలోకి వరద నీరు చేరింది. దీంతో విధులకు వచ్చే సిబ్బందితో పాటు ఫిర్యాదుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.