ADB: గుడిహత్నూర్‌లో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్నారులు, వాహనదారులపై కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇటీవల వడ్డెర కాలనీలో ఏడేళ్ల బాలికపై కుక్కలు దాడి చేయడం కలకలం రేపింది. అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
వీధి కుక్కలతో భయాందోళన


