హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్షణ కవచం లేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ బ్రిడ్జి సమీపంలోని పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు సంచరించే ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ లేకపోవడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.