హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు షాద్‌నగర్‌లో తీన్మార్‌ మల్లన్న పాదయాత్ర

HYD: టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ రాజ్యధికార యాత్ర 4వ రోజు షాద్‌నగర్ ప్రాంతంలో కొనసాగుతోంది. నందిగామ, షాద్‌నగర్, ఎలికట్టల మీదుగా మొగిలిగిద్ద వరకు సాగే ఈ యాత్రలో ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్ పాల్గొంటారు. అక్కడ నిర్వహించే కార్నర్ మీటింగ్‌తో నాలుగో రోజు ముగియనుంది. బీసీ సమస్యలపై అవగాహన కోసం ఈ యాత్ర కొనసాగుతోంది.