హైదరాబాద్: 28°C
తెలంగాణ

కట్ట నిండా కంపచెట్లు.. రాకపోకలకు ఇబ్బందులు

JN: లింగాలఘనపురం మండలంలోని నవాబుపేట రిజర్వాయర్‌ కట్టపై ఇరువైపులా కంపచెట్లు పెరిగిపోవడంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వాయర్‌ నిర్వహణలో భాగంగా అధికారులు కట్టపై రాకపోకలు సాగించాల్సి ఉన్నా చెట్లతో మార్గం ఇరుకుగా మారింది. అధికారులు స్పందించి కంపచెట్లను తొలగించాలని రైతులు కోరుతున్నారు.