PDPL: ధర్మారం మండలం మేడారంలో సర్పంచ్ వీర్పాల్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు ప్రారంభించారు. స్థానిక నంది రిజర్వాయర్లో నిమజ్జనం చేయనున్న సందర్భంగా పల్లె ప్రకృతి వనంలో రోడ్డుపైకి వచ్చిన చెట్లను తొలగించారు. రిజర్వాయర్ కట్టపై లైటింగ్ మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. నిమజ్జన సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తెలంగాణ
సర్పంచ్ ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్లు


