హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ ఉత్సవాల్లో ముగ్గుల పోటీలు

MLG: మంగపేట మండల కేంద్రంలో సమ్మక్క–సారక్క యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహించిన మ్యూజికల్ చైర్, ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.