హైదరాబాద్: 28°C
తెలంగాణ

రసాబాసగా మండల సర్వసభ్య సమావేశం

PDPL: ముత్తారం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిధుల కేటాయింపులో వివక్ష, విద్యుత్ అంతరాయాలు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, వైద్య సిబ్బంది లేమిపై సర్పంచ్లు చంద్రమౌళి, రవీందర్ రావు, చరణ్, సంపత్ అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ వైనాల రాజు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.