హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షం కోసం ఎదురుచూపులు.. ఎండిపోతున్న మక్క పంట

MBNR: నవాబుపేట మండలంలో వర్షాభావంతో మక్క రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మండల వ్యాప్తంగా సుమారు 7,500 ఎకరాల్లో సాగు చేసిన మక్క పంట కీలక దశలో నీరందక ఎండిపోయే పరిస్థితికి చేరుకుంది. పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందో లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.