హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

NRPT: జిల్లా కేంద్రంలో ఎస్‌. ఆర్ గార్డెన్‌లో గణేష్ ఉత్సవ సమితి, గణేష్ మండపాల నిర్వాహకులు శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శోభాయాత్రల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.