హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడిచర్లలో 29న డేంజర్‌ జోన్ నిర్వాసితులతో గ్రామసభ

BHPL: తాడిచర్ల గ్రామంలో జెన్‌కో డేంజర్‌ జోన్‌ పరిధిలో నివసిస్తున్న నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 29వ తేదీ మంగళవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నారు. తాడిచర్ల పాత హైస్కూల్‌ (పెద్దబడి) ఆవరణలో ఈ గ్రామసభ నిర్వహించనున్నట్లు గ్రామస్థులకు సమాచారం అందింది. గ్రామసభలో సంబంధిత విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిర్వాసితులు భావిస్తున్నారు.