NLG: తిరుమలగిరి సాగర్‌లో శనివారం రాత్రి జరిగిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఓ విషాదం ఘటన చోటుచేసుకుంది. తిరుమలగిరి సాగర్ మండల కేంద్రానికి చెందిన బాలయ్య శోభాయాత్రలో పాల్గొని డాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
వినాయక శోభయాత్రలో గుండెపోటుతో వ్యక్తి మృతి.!


