హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సుల కొరతతో ప్రయాణికుల ఇబ్బందులు

JN: జనగామ పట్టణంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం సాయంత్రం సూర్యాపేట బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పలువురు ఫుట్‌బోర్డుపై ప్రయాణించారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.