జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామం గణేష్ నవరాత్రి వేడుకల్లో ఆదర్శంగా నిలుస్తోంది. గత ఐదేళ్లుగా గ్రామంలోని అన్ని కులాలు, సంఘాలు, పార్టీలకు చెందిన ప్రజలు కలిసి ఒకే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి సమష్టిగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులు, యువత, మహిళలు, పెద్దలు కలిసి పూజలు, భజనలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలు చాటుతున్నారు.
తెలంగాణ
ఐదేళ్లుగా ఒకే గణపతి.. ఊరంతా ఒక్కటే


