హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VKB: తాండూరు మండలంలో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీ శంకర్ తెలిపారు. చెట్ల కొమ్మల తొలగింపు పనులు, విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మ.12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పెర్కొన్నారు. మండలంలోని కరణ్‌కోట, కోటబాస్పల్లి, జిన్ గుర్తి విద్యుత్ ఉపకేంద్రాల పరిధి గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు. అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.