WGL: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం ఇవాళ భక్తులతో కిక్కిరిసింది. సెలవు రోజు కావడంతో నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
తెలంగాణ
భద్రకాళి ఆలయంలో భక్తుల సందడి


