హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కేతకి ఆలయంలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SRD: ఝరాసంగం లోని కేతకి ఆలయంలో ఆదివారం సంగమేశ్వర స్వామికి విశేష అభిషేక పూజాలు నిర్వహించారు. గర్భగుడిలో శివలింగానికి ప్రత్యేక జలాభిషేకం, అర్చనలు చేసి, పార్వతి అమ్మవారి మూలవిరాట్‌ను రంగురంగుల సువాసనాభరిత పూలమాలలతో వైభవంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి, మహా హారతిని ఇచ్చారు. స్వామివారి దర్శనార్థం భక్తులు ఆలయానికి తరలివచ్చారు.