SDPT: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు నిర్వహించారు. భక్తులు కోరమీసాలు సమర్పించి, పట్నాలు వేసి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
నేడు కొమురవెల్లిలో స్వామివారికి ప్రత్యేక పూజలు


