BHPL: పట్టణ సమగ్ర అభివృద్ధికి చేపట్టిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీవోసీలో నిర్వహించిన సమీక్షలో రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, తాగునీటి పైప్‌లైన్‌లు, విద్యుత్ స్తంభాల తరలింపుపై చర్చించారు. పనుల్లో జాప్యం లేకుండా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
తెలంగాణ
భూపాలపల్లి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: MLA


