GDWL: మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ రిజ్వన్ బాష షేక్ తెలిపారు. 2027 మార్చిలో ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీకానున్న నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. నవంబరు 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ప్రక్రియ షురూ


