MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో వన దుర్గమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గులాబీ రంగు పట్టువస్త్రాలు, పూలమాలలు, వెండి ప్రభతో అమ్మవారి మూలవిరాట్‌ను దివ్యంగా అలంకరించారు. అర్చకులు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక హారతిని నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
తెలంగాణ
VIDEO: వన దుర్గమ్మకు ప్రత్యేక మంగళహారతి పూజలు


