హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేగొండలో పోషణ మహోత్సవం

BHPL: రేగొండ(M)కేంద్రంలోని ఒకటో అంగన్వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్ మాడగాని సుజాత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సూపర్‌వైజర్ సరోజన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ బరువున్న పిల్లల తల్లిదండ్రులకు ఆరోగ్యకరమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గుడ్లు, పాలు అందిస్తున్నట్లు తెలిపారు.