హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవనం సిద్ధం.. ప్రారంభం ఎప్పుడు?

JN: చిల్పూర్(మం) నష్కల్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘం భవనం నిర్మాణం పూర్తయినా వినియోగంలోకి రాలేదు. భవనం ప్రారంభం కాకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, నిర్మాణం పూర్తయిన భవనాన్ని వెంటనే ప్రారంభించి మహిళా సంఘాల కార్యకలాపాలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.