హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డబ్బులు డిమాండ్ చేయవద్దు: సీపీ

విశాఖలో నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను నగర సీపీ డా.శంఖబ్రత బాగ్చి సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జనాలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. నిమజ్జన ప్రాంతాలకు వెళ్ళే రహదారులు ట్రాఫిక్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేవిదంగా, డబ్బులు డిమాండ్ చేయకుండా నిమజ్జనానికి సహకరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.