హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంపై మాజీ మంత్రి ఆగ్రహం

VSP: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. కానీ.. జిల్లాకు వచ్చిన సీఎం కనీసం తాగునీటి సమస్య గురించి ప్రస్తావించలేదన్నారు. మూడు రోజులకి ఒకసారి కూడా నీరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యకు పరిష్కారం చూపకుండా వైసీపీ మీద విమర్శలతో సరిపెట్టేశారని మండిపడ్డారు.