WGL: వర్ధన్నపేట పట్టణంలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండనుంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రెండు గంటల పాటు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తరుణ్ శనివారం ప్రకటనలో తెలిపారు. సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


