JN: లింగాల ఘనపురం మండలంలోని నెల్లుట్లలో శనివారం పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. రైతు ఉప్పల వెంకటేశానికి చెందిన వ్యవసాయ బావి వద్ద వర్షం కురుస్తుండగా పిడుగు పడటంతో అక్కడున్న ఆవులు మృతి చెందినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 80 వేలు ఉంటుందని రైతు పేర్కొన్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి


