హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో కొండచిలువ కలకలం

నిజామాబాద్ జిల్లా చందూర్ వైకుంఠధామం సమీపంలో గడ్డి వాము వద్ద కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామంలోని పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వగా, అక్కడికి చేరుకున్న ఆయన చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అనంతరం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. కొండచిలువను తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.