హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

NRML: వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ పరిశీలించారు. ఘాట్‌ల వద్ద బారికేడింగ్, లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.