BHPL: ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని సీఐ యెడ్లపల్లి సతీష్ అన్నారు. శనివారం చిట్యాల మండలం భీష్మనగర్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించి ఇళ్లలో సోదాలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 22 వాహనాలకు జరిమానా విధించడంతోపాటు గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సతీష్ ,ఓంపాల్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కార్డెన్ సెర్చ్‌లో 22 వాహనాలపై జరిమానా


