SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు పత్తాలాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో కోహెడ పోలీసులు దాడి చేశారు. ఎగుర్ల ఐలయ్య ఇంట్లో వేగ్గలం చంద్రమౌళి, బుర్ర రమేష్, ఎగుర్ల ఐలయ్య, చుంచు సుమన్, పిల్లి అంజయ్య, సిగిరి రాజు పత్తాలాట ఆడుతుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,360 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు


