హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్యాంకర్ ఓనర్ల సమ్మె నోటీసు ఉపసంహరణ

HYD: నగరంలో తాగునీటిని సరఫరా చేసే ట్యాంకర్ల రేట్ల పెంపుపై సానుకూల హామీ లభించడంతో సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ట్యాంకర్ల యాజమానుల యూనియన్‌లు ప్రకటించాయి. జలమండలి ఎండీ ఇచ్చిన స్పష్టమైన హామీ నేపథ్యంలో, ప్రతిపాదిత సమ్మె నిర్ణయాన్ని విరమించుకుని ట్యాంకర్ సేవలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి.