హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ రెజ్లర్ రిమాండ్

HYD: పెళ్లి పేరిట నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ అంతర్జాతీయ రెజ్లర్ సౌరవ్ గుర్జార్‌ను గచ్చిబౌలి పోలీసులు ముంబై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా అదుపులోకి తీసుకున్న ఆయనను ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తరలించి రిమాండ్‌కు పంపినట్లు సీఐ సైదులు తెలిపారు.