హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ ఘాతానికి గురై బైక్ మెకానిక్ మృతి

ADB: ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయకుంటకు చెందిన మెకానిక్ పవార్ వికాస్ వాడ్ గావ్ రోడ్డు సమీపంలోని తన షాప్ వద్ద శనివారం బైక్‌కు వాటర్ వాషింగ్ చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.