హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుడికి ఘనంగా కుంకుమార్చన

PDPL: ధర్మారం మండలం పత్తిపాకలో శనివారం గణనాథుడికి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలతో మండప పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం పురోహితుడు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.