WGL: వరంగల్ జిల్లాలో ఎస్ఐఆర్‌లో భాగంగా జారీ చేసిన 1,94,395 నోటీసుల్లో ఇప్పటివరకు 39,855 మందికి విచారణ పూర్తయిందని కలెక్టర్ సత్యశారద శనివారం తెలిపారు. నర్సంపేటలో 13,460, వరంగల్ తూర్పులో 10,236, వర్ధన్నపేటలో 15,495 మందికి విచారణ పూర్తయిందన్నారు. SIR ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
39,855 మందికి SIR విచారణ పూర్తి: కలెక్టర్


